మంగళవారం రోజు అక్కినేనివారి ఇంట్లో అఖిల్ మరియు జైనబ్ ఎంగేజ్మెంట్ జరిగింది.
అక్కినేని నాగార్జున జైనబ్ రవిడ్జీ ఆశీర్వదించి అక్కినేని కుటుంబంలోకి స్వాగతించాడు .
అక్కినేనివారి ఇంట్లో ఏర్పడిచిన ఎంగేజ్మెంట్ సెర్మనీ కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రుల ఉపస్థితిలో జరిగింది .
అఖిల్ మరియు జైనబ్ ల పెళ్లికి డేట్ ఇంకా ఫైనలైజ్ చేయలేదు ,కానీ వచ్చే సంవత్సరంలో వాళ్ళ పెళ్లి బాజాలు మోగబోతున్నాయి.
అఖిల్ అక్కినేని పెళ్లి చేసుకోబోతున్న జైనబ్ రవిడ్జీ ఎవరు ?
అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేనిని పెళ్లి చేసుకోబుతున్న జైనబ్ రవిడ్జీ ఎవరు ?
జైనబ్ రవిడ్జీ తండ్రి జుల్ఫీ రవిడ్జీ అయన ఒక వ్యాపారవేత్త కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఫేమస్ వ్యక్తి ,వాళ్ళ నాన్నగారు జైన్ రవిడ్జీ ZR Renewable Energy Pvt Ltd అనే కంపెనీకి CEO గా ఉండేవారు .
జైనబ్ రవిడ్జీ ఒక ఆర్టిస్ట్ ఇండియా ,లండన్ ,దుబాయ్ ,దేశాలలో ప్రయాణిస్తూ అక్కడి కల్చర్స్ ని తన క్రియేటివిటీ తో ఒక్కటి చేస్తుంది. జైనబ్ తను వేసిన పెయింటింగ్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది తన పెయింటింగ్స్ చాల ఫేమస్ ఎక్సిబిషన్స్ లో ప్రదర్శనకు ఉంచారు . హైద్రాబాద్ లో జరిగిన 'రిఫ్లెక్షన్స్ 'అనే ఎక్సహిబిషన్లో కూడా తన పెయింటింగ్ ప్రదర్శించబడింది .
రెండు సంవత్సరాల క్రితం అఖిల్ మరియు జైనబ్ ఒకరినొకరు కలుసుకున్నారు వాళ్ళ స్నేహం ఒకరికి ఒకరిపై ఉన్న రెస్పెక్ట్ వల్ల ప్రేమగా మారింది. అఖిల్ మరియు జైనబ్ ఎంగేజ్మెంట్ జరిగిన సంతోశాన్ని నాగార్జున ఇలా వ్యక్తపరిచారు 'ఒక తండ్రిగా ఇది చాల సంతోషాన్ని ఇస్తుంది, అఖిల్ జైనబ్ తో కలిసి తన లైఫ్ లో ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకున్నాడు జైనబ్ అఖిల్ జీవితం లో ఒక అంద మైన తోడుగా నిలుస్తుంది . జైనబ్ మా ఫ్యామిలిలో ఒక అద్భుతమైన సంతోషాన్ని తీసుకొచ్చింది ,మా ఇరువురి కుటుంబాల ఈ జర్నీ ని సెలెబ్రేట్ చేసుకోవడానికి చాల ఉత్సుకతతో వున్నాను'.
ఎంగేజ్మెంట్ ఫొటోస్ షేర్ చేసుకున్న అఖిల్ ఇలా రాసుకొచ్చాడు “Found my forever. Happy to announce that Zainab Ravdjee and I are happily engaged."
డిసెంబర్అ 4 న జరగబోయే అక్కినేని నాగచైతన్య మరియు శోభిత ధూళిపాళ్ల పెళ్లికి సిద్దమౌతున్న వేళలో ,అఖిల్ మరియు జైనబ్ ల ఎంగేజ్మెంట్ న్యూస్ రావడం అక్కినేని అభిమానులకు సంతోషాన్ని ఇస్తుంది .
No comments:
Post a Comment